
హెచ్‌ఐవీపై అవగాహన అవసరం
మచిలీపట్నంఅర్బన్: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌తో పాటు ఇతర వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించుకోవాలని ఇన్‌చార్జ్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అంబటి వెంకట్రావు పిలుపునిచ్చారు. జిల్లా వైద్యశాఖ కార్యాలయం, దిశ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ ప్రచార రథాన్ని శుక్రవారం ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు హెచ్‌ఐవీ/ ఎయిడ్స్, క్షయ, సుఖ వ్యాధులపై చిత్ర ప్రదర్శనలతో అవగాహన కల్పించడం, ప్రజల సందేహాలకు సమాధానాలు ఇవ్వడం ఈ ప్రచార రథం ముఖ్య ఉద్దేశమన్నారు. దిశ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ ఎల్. మధుసూదనరావు, క్లస్టర్ ప్రివెన్షన్ అధికారి కె. రవికుమార్, గైడ్ ప్రోగ్రాం మేనేజర్ వై. శశికళ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా ఇన్‌చార్జి
వైద్య, ఆరోగ్యశాఖాధికారి వెంకట్రావు