
‘ముందడుగు’ బాధితులకు అండగా ఉంటాం
పెదపారుపూడి: నాగాపురం గ్రామానికి చెందిన ముందడుగు బాధితులకు అండగా ఉంటామని పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని నాగాపురం గ్రామంలో ముందడుగు బాధితులు ఏర్పాటు చేసిన సమావేశంలో మంగళవారం రాత్రి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1982లో అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ ఏవీఎస్ రెడ్డి పేదవారికి మంచి చేయాలనే ఆలోచనతో గ్రామంలో ఫిషర్‌మెన్ సొసైటీ ఏర్పాటు చేసి, రీ సర్వే నంబర్ 889/2లో 11.50 ఎకరాల భూమిని 21మంది లబ్ధిదారులకు ముందడుగు పేరిట ఇంటర్వ్యూలు నిర్వహించి మరీ అందించారన్నారు. అయితే కృష్ణారావు అనే రైతు అది తన భూమిగా చెబుతూ కోర్టులో కేసులు వేసి ఇబ్బందులుకు గురిచేస్తున్నారన్నారు. గతంలో గుడివాడ కోర్టులో వేసిన కేసును కొట్టేసినా.. తప్పుడు పత్రాలతో హైకోర్టుకు వెళ్లారన్నారు. హై కోర్టు కూడా అతని భూమి ఎక్కడ ఉందో గుర్తించి, అది మాత్రమే అప్పగించాలని చెప్పిందన్నారు. అయితే రెవెన్యూ అధికారులు కనీసం నోటీసులు ఇవ్వకుండా సర్వే చేసి పోలీసులతో ముందడుగు బాధితులపై దౌర్జన్యం చేయడంతో ఓ వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం చేయాలని కై లే డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.
అధికార పార్టీ నేతలకు తొత్తులుగా పోలీసులు..
అనంతరం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ పెదపారుపూడి పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని కై లే మండిపడ్డారు. వెంట్రప్రగడ గ్రామానికి చెందిన దళితుడు వీర్రాజు అనే వ్యక్తి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తుండగా.. అన్యాయంగా ఉద్యోగంలో నుంచి తీసేసి దాన్ని డబ్బులకు అమ్ముకున్నారని విమర్శించారు. ఇంటి పక్కన వ్యక్తి వచ్చి వీర్రాజు తలపై రెండునెలల క్రితం దాడి చేస్తే ఎనిమిది కుట్లు పడ్డాయని, దీనిపై ఎస్‌ఐతో మాట్లాడి కేసు నమోదు చేయలని తాను స్వయంగా అడిగితే.. దాడి చేసిన వారు గాయపడిన వ్యక్తిపై రేప్‌కేస్ పెట్టారని, ఒకవేళ కేసులు కడితే ఇద్దరిపై కడతామని ఎస్‌ఐ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్