
కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే వంశీ
గన్నవరం/ఉయ్యూరు: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ సోమవారం గన్నవరంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరయ్యారు. ఆత్కూరు పీఎస్‌లో నమోదైన కేసులో కోర్టు బెయిల్ షరతుల మేరకు సంతకం చేసేందుకు ఆయన ఉదయం ఇక్కడికి వచ్చారు. అయితే జడ్జి ఎన్.గాయత్రి సెలవులో ఉన్నారు. గన్నవరం కోర్టుకు ఉయ్యూరు కోర్టు జడ్జి శ్రీహరి ఇన్‌చార్జిగా ఉన్నారు. దీంతో ఇన్‌చార్జ్ కోర్టయిన ఉయ్యూరులోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు వంశీ హాజరయ్యారు. కండీషన్ బెయిల్ నిమిత్తం ఉయ్యూరు కోర్టులో సూపరింటెండెంట్ రాజేశ్వరరావు సమక్షంలో సంతకం చేశారు. తొలుత గన్నఅనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వంశీమోహన్‌ను వరంలోని కోర్టు వద్ద పలువురు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కలిసి పరామర్శించారు.
20న పోలీసు శాఖ పాత సామగ్రి వేలం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలోని మోటార్ ట్రాన్స్‌పోర్టు విభాగంలో వినియోగంలో లేని పోలీసు వాహనాల సామగ్రిని ఈ నెల 20న వేలం వేయనున్నట్లు మోటార్ ట్రాన్స్‌పోర్టు ఇన్‌స్పెక్టర్ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహనాల పాత టైర్లు, బ్యాటరీలు, ఇతర పాత విడిభాగాలు, వస్తువులను సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ గ్రౌండ్‌లో బహిరంగ వేలం వేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ వేలంలో పాల్గొన వచ్చని సూచించారు.