
అలరించిన నాట్య ప్రదర్శనలు
కూచిపూడి(మొవ్వ): కూచిపూడిలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కళారత్న డాక్టర్ వేదాంతం రాధేశ్యాం ఆధ్వర్యంలో ఆదివారం ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) సందర్భంగా నిర్వహించిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రవాస భారతీయ నాట్య కళాకారిణి లహరి (అమెరికా), కోల్‌కతాకు చెందిన కళాకారిణి డెబ్జానిబాసు (భరతనాట్యం) అంశాలను అలరించాయి. తాళ్లాబత్తుల సింధు భార్గవి, లక్కో జుధాత్రి, ఆత్మకూరి సువర్ణ శ్రావ్య శ్రీ శార్వాణి, జి.సత్యానందిని పలు కూచిపూడి నాట్య అంశాలను ప్రదర్శించి మైమరపించారు. అతిథులు విశ్రాంత తెలుగు పండితుడు వెంపటి బాపయ్య శాస్త్రి, విశ్రాంత ఫైర్ అధికారి జోశ్యుల నాగ జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.