ఎంఈఎఫ్ జిల్లా కమిటీ ఏర్పాటు
మచిలీపట్నంటౌన్: ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాలతో మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కృష్ణాజిల్లా నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్నికల్లో ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి బిక్షాలు మాదిగ తెలిపారు. ఎంఈఎఫ్ కృష్ణా జిల్లా నూతన కమిటీ అధ్యక్షుడిగా దేవరపల్లి విక్టర్ బాబు, ఉపాధ్యక్షుడిగా జే అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా బీడెల్లి మరియ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శిగా బొకినాల కృష్ణ, కోశాధికారిగా రాచపూడి బాలస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉడుముల దుర్గారావు, గౌరవ అధ్యక్షుడిగా మేదర రమేష్, గౌరవ ముఖ్య సలహాదారుగా రావెల వరుణ్ కుమార్, లీగల్ అడ్వైజర్‌గా అద్దేపల్లి నిరంజన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గండ్రపు శీనయ్య మాస్టర్, ఏసుబాబు, రాబర్ట్ జాన్సన్, పి.నవీన్, ధనరాజు, ఎం.ప్రభాకర్‌రావు, ఎం.ప్రవీణ్, ఎం.జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
925 వెండి నాగపడగలు సమర్పించిన అజ్ఞాత భక్తులు
ఘంటసాల: స్థానిక నాగేంద్ర స్వామి పుట్ట వద్ద అజ్ఞాత భక్తులు వెండి నాగ పడగలు వేసి వెళ్లినట్లు శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు గొర్రెపాటి వెంకట రామకృష్ణ(ట్రస్టీ), గొర్రెపాటి జగన్మోహనరావు, గొర్రెపాటి సురేంద్ర సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల గ్రామంలో ప్రసిద్ధి గాంచిన సంతాన సాఫల్య స్వామిగా పేరుగాంచిన శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ(షష్టి గుడి) ప్రాంగణంలోని నాగేంద్ర స్వామి పుట్ట వద్ద మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని అజ్ఞాత భక్తులు వెండితో చేసిన నాగ పడగలు పుట్టపై వేసి వెళ్లిపోయారన్నారు. వీటిని ఆలయ సిబ్బంది గుర్తించి తమకు అందజేశారని చెప్పారు. వాటిని లెక్కించగా 925 నాగ వెండి పడగలు ఉన్నాయన్నారు. భక్తులు తమ కోర్కెలు తీరినందు వల్లే ఇలా మొక్కబడి తీర్చుకుని ఉంటారని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఆలయ చరిత్రలో తొలిసారిగా పుట్టపై భక్తులు వెండి నాగ పడగలు వేశారని, ఆ భక్తులకు స్వామి వార్ల ఆశీస్సులు అందించాలని కోరారు. వీటి విలువ రూ.లక్ష వరకు ఉంటుందని ఆలయ ధర్మకర్తలు అంచనా వేశారు.
ఎంఈఎఫ్ జిల్లా కమిటీ ఏర్పాటు


