
నష్టం పోతున్నాం..
డ్రెయిన్లు, కాలువల్లో సకాలంలో పూడికతీత పనులు చేయకపోవడంతో పంట పొలాలు నీట మునిగిపోతున్నాయి. చేయాల్సిన సమయంలో పూడిక తీత పనులు చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మకై ్క పనులు చేయకుండా బిల్లులు చేయించేసుకుంటున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
–శ్రీనివాసరావు, రైతు గుడివాడ
పూడికతీతీ వెంటనే చేపట్టాలి
ప్రధాన కాలువలు, అనుబంధ కాలువలు అన్నీ గుర్రపు డెక్కతో నిండిపోయాయి. మట్టి మేట వేసుకుపోయి వాటి నుంచి సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేసవిలో కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టకపోతే ఖరీఫ్ నాటికి భూములకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బంది నెలకొంటుంది.
– నెరుసు నాని, రైతు ఉప్పులూరు
●

నష్టం పోతున్నాం..