
ఎయిర్‌పోర్ట్‌లో కట్టుదిట్టమైన భద్రత
విమానాశ్రయం(గన్నవరం): అమరావతి రాజధాని నిర్మాణ పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ప్రధాని భద్రత వ్యవహారాలు చూసే ఎన్‌ఎస్‌జీ దళాలు ఇక్కడికి చేరుకుని విమానాశ్రయాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నాయి. పోలీస్ శాఖతో కలిసి ఎన్‌ఎస్‌జీ దళాలు ప్రధాని భద్రత అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించి ఎన్‌ఎస్‌జీ పర్యవేక్షణలో ట్రయల్‌రన్ కూడా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరువనంతపురం నుంచి విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 2.50 గంటలకు ఇక్కడకు చేరుకోనున్నారు. అనంతరం 2.55 గంటలకు వాయుసేన హెలికాఫ్టర్‌లో ఇక్కడి నుంచి అమరావతి ప్రాంతానికి బయలుదేరివెళ్తారు. అక్కడ నుంచి సాయంత్రం 5.15 గంటలకు ఇక్కడకు చేరుకుని అదే విమానంలో న్యూఢిల్లీ బయలుదేరి వెళ్తారని అధికారులు తెలిపారు. ప్రధాని రాక సందర్భంగా విమానాశ్రయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏలూరు రేజ్ డీఐజీ అశోక్‌కుమార్, కృష్ణా ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు.
రైల్వేస్టేషన్‌లో విస్తృత తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైల్వే ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ ఆదేశాల మేరకు డీఎస్పీ రత్నరాజు ఆధ్వర్యాన జీఆర్‌పీ సీఐ జె.వి. రమణ ఆర్‌పీఎఫ్ అధికారుల సమన్వయంతో విజయవాడ రైల్వేస్టేషన్‌లో విస్తృతంగా తనిఖీలు చేశారు. పహల్గాం ఉగ్రవాదుల దాడి, అమరా వతిలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు ఈ తనిఖీలు చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో అనుమానితులు, సంఘవిద్రోహ శక్తులను గుర్తించడానికి ప్రత్యేంగా రైల్వే పోలీసులు, జాగిలాలు, డీఎఫ్‌ఎండీ, హెచ్‌హెచ్‌ఎండీలతో స్టేషన్‌లో క్షుణంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రైల్వే డీఎస్పీ రత్నరాజు మాట్లాడుతూ ఆర్‌పీఎఫ్ పోలీసుల సమన్వయంతో అసాంఘిక శక్తులు రైల్వే స్టేషన్‌లోకి చొరబడకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. స్టేషన్‌లోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో నిరంతరం గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైల్వేస్టేషన్, పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అనుమానిత వ్యక్తులు గానీ, బ్యాగులు గానీ ఉంటే రైల్వే పోలీసులకు లేదా 139కు ఫోన్‌చేసి సమాచారం అందించాల్సిందిగా కోరారు.
దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన జి.నాగకుమారి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి రూ. లక్ష విరాళాన్ని అన్నదానానికి అందజేశారు. చైన్నెకి చెందిన డి.ఫణీంద్రరావు కుటుంబం ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో 9.12 మి.మీ. సగటు వర్షపాతం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో 9.12 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గంపలగూడెం మండలంలో 25.2 మిల్లీమీటర్లు, ఇబ్రహీంపట్నంలో 22.4, విజయవాడ సెంట్రల్‌లో 16.4, వెస్ట్‌లో 16.4, వీరులపాడు, జి. కొండూరు, విజయవాడ నార్త్‌లో 15.2 మిల్లీమీటర్ల చొప్పున, విజయవాడ రూరల్‌లో 14.8, ఈస్ట్‌లో 14.6, మైలవరం 9.4, తిరువూరులో 6.6, వత్సవాయి 6.0, కంచికచర్లలో 3.6, ఎ.కొండూరలో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఎయిర్‌పోర్ట్‌లో కట్టుదిట్టమైన భద్రత