
హెల్త్ క్యాంపును పర్యవేక్షిస్తున్న డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ డివిజన్‌లో లోకో పైలట్‌లు, అసిస్టెంట్ లోకోపైలట్‌ల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్య ఇస్తున్నట్లు రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. సత్యనారాయణపురంలోని ఈటీటీసీ (ఎలక్ట్రిక్ ట్రాక్షన్ టైనింగ్ సెంటర్)లో లోకో పైలట్‌లు, అసిస్టెంట్ లోకోపైలట్‌లకు హెల్త్ క్యాంపు, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ పాల్గొని క్యాంపును ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ భారతీయ రైల్వేలో లోకో పైలెట్‌లు నిజమైన సైనికులని కొనియాడారు. సురక్షితమైన రైళ్ల కార్యకలాపాలకు రన్నింగ్ స్టాఫ్ ఆరోగ్యం ఎంతో ముఖ్యమన్నారు. విధి నిర్వహణలో ఒత్తిడి లేకుండా పనిచేయడానికి వారి కుటుంబ సహకారం ఎంతో అవసరమన్నారు. లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే భారాన్ని మోస్తున్న లోకో పైలట్‌లు ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా విధులకు హాజరవ్వాలని సూచించారు. విజయవాడతో పాటు నెల్లూరు, రాజమండ్రి, బిట్రగుంట, కాకినాడ పోర్టులలో ఏకకాలంలో డిసెంబర్ 2 వరకు ఈ మెడికల్ క్యాంపు ని ర్వహించినట్లు తెలిపారు. ఏసీఎమ్‌ఎస్ డి.సీతారామ్ మాట్లాడుతూ ప్రతి రోజు వ్యాయామం, యోగా చేయడంతో చేయడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటారని, క్రమం తప్పకుండా లోకో రన్నింగ్ స్టాఫ్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరిక్షలు చేపించుకోవాల్సిందిగా సూచించారు. సీనియర్ డీఈఈ శ్రీనివాసరావు కొండ, సీఎమ్‌ఎస్ డాక్టర్ శౌరిబాల, సిబ్బంది, లోకో పైలట్‌లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
డీఆర్‌ఎమ్ నరేంద్ర ఏ పాటిల్