అమరుల త్యాగాలతోనే స్వరాష్ట్రం | - | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగాలతోనే స్వరాష్ట్రం

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

కాగజ్‌నగర్‌టౌన్‌: ఉద్యమంలో అమరుల త్యాగం ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారమైందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో జెండా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చి గుర్తిసామని ప్రకటించిందన్నారు. ఇందుకు అనుగుణంగా ఉద్యమకారులందరికీ సముచిత గౌరవం కల్పించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానా, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, కౌన్సిలర్లు, ఉద్యమకారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement