రెబ్బెన: రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి పాత్ర ఎంతో కీలకమని బెల్లంపల్లి ఏరియా ఇన్‌చార్జి జీఎం మచ్చగిరి నరేందర్ అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లో మంగళవారం సింగరేణి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీఎం కార్యాలయంలో తెలంగాణ తల్లి, అమరవీరుల స్తూపం, ప్రొ.జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేశా రు. అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం గోలేటిలోని ప్రధాన రహదారి, కార్మిక కాలనీల్లో తెలంగాణ రన్ నిర్వహించారు. ఇన్‌చార్జి జీఎం మాట్లాడుతూ రాష్ట్ర, దేశ అవసరాలకు అనుగుణంగా సింగరేణి బొగ్గు అందిస్తోందని తెలిపా రు. ఉద్యోగులంతా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి భీమన్న స్టేడియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మలు, బోనాలతో సేవా సమితి సభ్యులు, అధికా రులు వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం కేక్‌కట్ చేశారు. ప్రతిభ చూపిన ఉద్యోగులను శాలువా లతో సన్మానించారు. సేవా సమితి ద్వారా శిక్షణ పొంది స్వయం ఉపాధిలో రాణిస్తున్న సభ్యులు, చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమాల్లో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి అధికా రుల సంఘం ప్రతినిధి వీరన్న, ఇన్‌చార్జి సేవా అధ్యక్షురాలు నళిని నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఇన్‌చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్, పర్సనల్ హెచ్‌వోడీ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.


