ఆసిఫాబాద్‌రూరల్: హరితదళం(ఎన్‌జీసీ) ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, నీటి వనరుల సంరక్షణ, వర్థ్యాల నిర్వహణ, మొక్కల పెంపకంపై సమ్మర్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ కె.హరిత అన్నారు. సమ్మర్ క్యాంపుల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన బాబాసాగర్ హెచ్‌ఎం సత్యనారాయణ, పెంచికల్‌పేట్ హెచ్‌ఎం నిర్మల, వాంకిడి హెచ్‌ఎం నటరాజుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం ప్రశంసాపత్రాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లోని విద్యార్థుల్లో ప్రకృతిపై బాధ్యతభావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో జాతీయ హరిత జిల్లాకోఆర్టినేటర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 11 నుంచి మాస్టర్ మైండ్స్ గూగుల్ మీట్ ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమవుతాయని కలెక్టర్ కె.హరిత తెలిపారు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఆన్‌లైన్ తరగతుల ప్రచార పోస్టర్‌ను జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం జిల్లా సైన్స్ అధికారి మధుకర్‌తో కలిసి ఆవిష్కరించారు.


