అవకాశం ఇవ్వలేదనడం హాస్యాస్పదం | - | Sakshi
Sakshi News home page

అవకాశం ఇవ్వలేదనడం హాస్యాస్పదం

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

● ఎమ్మెల్సీ దండె విఠల్‌

కాగజ్‌నగర్‌టౌన్‌: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీఎం సభలో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కెరమెరి మండలం కోఠారిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్లు తెలిపా రు. ఉనికిని కోల్పోతున్నామని, పబ్బం గడుపుకొనేందుకు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలను సీఎంకు విన్నవించామని, త్వరలోనే ఆమోదం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానా, కౌన్సిలర్లు శారద, జ్యోతి, విజయ్‌కుమార్‌, నాయకులు దస్తగిర్‌, శ్యాంరావు, మెహరాజ్‌ హుస్సేన్‌, శ్రీను, సంతోష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement