విద్యార్థులకు వసతుల కల్పన
ఆసిఫాబాద్‌రూరల్: వసతిగృహాల్లోని విద్యార్థులకు సకల వసతులు కల్పించి, నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో వంటశా ల, సామగ్రి నిల్వ చేసే గదులు, పరిసరాలను మంగళవారం పరిశీలించారు. ఆయన మా ట్లాడుతూ మెనూ ప్రకారం రుచికరమైన ఆహా రం అందించేందుకు తాజా కూరగాయలు, నిత్యావసరాలు వినియోగించాలని సూచించారు. వంట సరుకులు నిల్వ ఉంచే గదులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తిచేసి, వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఆదేశించారు.


