కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించాలి
వాంకిడి(ఆసిఫాబాద్): ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని జిల్లా కుష్ఠు వ్యాధి నిర్మూలన నోడల్ అధికారి ఇస్లావత్ శ్యాంలాల్, మండల వైద్యాధికారి వినయ్ ఉప్రే అన్నారు. ‘కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య, ఆశ కార్యక్తలకు శిక్షణ అందించారు. వారు మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 31 వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. రెండేళ్ల పైబడిన వారందరికీ భౌతిక పరీక్షలు నిర్వహించి, అనుమానితుల జాబి తా తయారు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి పెందుర్ రవిదాస్, సిబ్బంది పాల్గొన్నారు.


