ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు
ఆసిఫాబాద్‌అర్బన్: మూడో విడత ఎన్నికలు జరిగే మండల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో మంగళవారం పోలీసు బాంబు డిస్పోజ ల్ టీం, డాగ్‌స్క్వాడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాలు, రూట్ మ్యాపులు, రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలు, వంతెనలు, బస్టాండ్లు, ప్రవేశ ద్వారాలను పరిశీలించారు. ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, రిజర్వ్ పోలీస్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్ టీమ్స్ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


