నేడే తుది ఫలితం!
నాలుగు మండలాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు 104 సర్పంచ్ స్థానాలకు 377 మంది పోటీ పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది
జీపీలు కేంద్రాలు
ఆసిఫాబాద్: పంచాయతీ పోరు తుదిదశకు చేరింది. మూడో విడతలో భాగంగా ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్ మండలాల్లో బుధవారం ఎన్నికలు ని ర్వహించనున్నా రు. పోలింగ్ అ నంతరం కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. నా లుగు మండలాల్లో 108 పంచా యతీలు, 938 వార్డు స్థానాలు ఉన్నాయి. ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడ పంచాయతీలో రిజర్వేషన్ ఎస్సీ, రహపల్లిలో ఎస్టీకి కేటాయించారు. ఆ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు లేకపోవడంతో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో అక్కడ సర్పంచ్ స్థానానికి ఎన్నికలు నిర్వహించడం లేదు. కాగజ్‌నగర్ మండలంల చింతగూడ, రేగులగూడ పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. ప్రస్తుతం 104 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, 377 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 938 వార్డుల్లో 186 స్థానాలు ఏకగ్రీవం కాగా, ఎనిమిది స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 744 వార్డు స్థానాలకు 2,098 మంది పోటీ పడుతున్నారు.
938 పోలింగ్ కేంద్రాలు
నాలుగు మండలాల పరిధిలో 1,22,249 మంది ఓటర్లు ఉండగా, వీరీలో 61,282 మంది పురుషులు, 61,141 మంది మహిళలు, ఆరుగురు ఇతరులు ఉన్నారు. ఎన్నికల కోసం మొత్తం 938 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్వహణ కోసం 1,079 మంది పీవోలు, 1,241 మంది ఓపీవోలను కేటాయించగా, 795 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు. మంగళవారం సాయంత్రం నాలుగు మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బంది సామగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో సామగ్రి పంపిణీని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్ పర్యవేక్షించగా, రెబ్బెనలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్‌లో సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పర్యవేక్షించారు.
గెలుపు కోసం పాట్లు
పంచాయతీ ఎన్నికల్లో గెలుపుకోసం అభ్యర్థులు పడరానిపాట్లు పడుతున్నారు. మొదటి, రెండో విడతల్లో అభ్యర్థులు భారీగా ఖర్చు చేసినా పలుచోట్ల గెలుపు వరించలేదు. దీంతో మూడోవిడతలో పోటీలో ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. గెలిస్తే చేపట్టే అభివృద్ధి పనులపై హామీలు కురిపించడంతోపాటు కరపత్రాల్లో వివరాలు ప్రచురించారు. గ్రామాల్లో మద్యం, విందులతో ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు సాగించినా ఫలితం ఎలా ఉంటుందో తెలియక మదనపడుతున్నారు. ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల పైగా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.
సామగ్రితో పోలింగ్
కేంద్రానికి వెళ్తున్న సిబ్బంది
పోలింగ్ ప్రక్రియ ఇలా..
కాగజ్‌నగర్‌టౌన్/కాగజ్‌నగర్‌రూరల్: ఉద యం 6.45 గంటలకు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తారు. వార్డు సభ్యుడు, సర్పంచ్‌గా పోటీ చేసే వారి తరఫున ఒక్కో ఏజెంట్‌ను అనుమతిస్తారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారు. ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వెంట తీసుకెళ్లాలి. వార్డు సభ్యులకు తెల్లరంగు బ్యాలెట్, సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ రంగు బ్యాలెట్ కేటాయించారు. బ్యాలెట్‌లో సీరియల్ నంబర్, అభ్యర్థుల గుర్తులే ఉంటాయి. పోలింగ్ కేంద్రం బయట అతికించే పోస్టర్‌లో అభ్యర్థి పేరు, గుర్తు ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు బ్యాలెట్ బాక్స్ సీల్ చేసి లెక్కింపు జరిగే ప్రాంగణానికి తరలిస్తారు. ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రంలోకి చేరుకుని క్యూలైన్‌లో ఉండేవారికి అధికారులు టోకెన్లు జారీ చేసి ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తారు.
మండలాల వారీగా ఓటర్లు, ఎన్నికల అధికారులు, పోలింగ్ కేంద్రాలు
మండలం మొత్తం ఓటర్లు పోలింగ్ పీవోలు ఓపీవోలు
ఆసిఫాబాద్ 27 30,135 236 270 284
కాగజ్‌నగర్ 28 45,242 266 307 406
రెబ్బెన 24 28,724 214 247 294
తిర్యాణి 29 18,148 222 255 257
మొత్తం 108 1,22,249 938 1,079 1,241
ఆసిఫాబాద్ ఎంపీడీవో కార్యాలయంలోని పంపిణీ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది
నేడే తుది ఫలితం!
నేడే తుది ఫలితం!
నేడే తుది ఫలితం!


