తుది విడతకు ఏర్పాట్లు పూర్తి
ఆసిఫాబాద్: తుది విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నిక ల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. సామగ్రి పంపిణీ తీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ బుధవా రం నాలుగు మండలాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ప్రతీ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారని పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ డేవిడ్, తహసీల్దార్ రియాజ్ అలీ ఉన్నారు.


