‘సమస్యల పరిష్కారానికి కృషి’
కెరమెరి(జైనూర్): గ్రామాల్లోని సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని డీసీ సీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నరు. జైనూర్ మండలం జెండాగూడలో నూతనంగా ఎన్నిౖకైన సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలతో ఆది వారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు సమస్యలు, ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి తోడ్పాటునందించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పనిచేస్తుందని పేర్కొన్నారు. అవసరమైన గ్రామాలకు సీఎంతో మాట్లాడి నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. జెండాగూడ, రాసిమెట్ట, భూసిమెట్ట, సిర్పూర్(యూ)మండలంలోని ధన్నూర్ పంచాయతీ సర్పంచులు ఉయిక సంజీవ్, పి.చందన్‌శావ్, చందు, దుర్వ సింధు, స్పందనను సత్కరించారు. కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్, నాయకులు ముఖీద్, శ్రీనివాస్, ప్రకాశ్, మహేశ్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.


