ఓటు మరువని వృద్ధులు
దహెగాం/చింతలమానెపల్లి: ఎన్నికల్లో వృద్ధులు ఓటుహక్కు వినియోగించుకుని బాధ్యత చాటుకున్నారు. మలి వయస్సులోనూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దహెగాం మండలం ఇట్యాలలో గొర్రెగుట్టకు చెందిన రసూల్‌బీ అనే 105 ఏళ్ల వృద్ధురాలికి ఓటువేయడానికి పోలీసులు సహకరించారు. బీబ్రాలో శతాధిక వృద్ధురాలు ఓటు వేశారు. చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్ –2లో 95 ఏళ్ల దామిని గైన్ ఓటు వేశారు. ర్యాంపులు లేక దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు.
బీబ్రాలో శతాధిక వృద్ధురాలిని తీసుకువస్తున్న పోలీసులు
గూడెంలో ర్యాంప్ లేక వృద్ధురాలికి ఇబ్బందులు
ఓటు వేసిన 95 ఏళ్ల దామిని గైన్
ఓటు వేసేందుకు వెళ్తున్న
వృద్ధురాలు
ఇట్యాలలో ఓటు వేసిన
105 ఏళ్ల రసూల్ బీ
రవీంద్రనగర్– 2లో వృద్ధురాలిని తీసుకెళ్తున్న యువకులు


