ప్రశాంతంగా రెండోవిడత ఎన్నికలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా ఆదివారం ఎస్పీ నితిక పంత్, ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాస్ తో కలిసి ఎన్నికల సరళిని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ప్ర శాంతంగా జరిగిందన్నారు. సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి సారించి వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించామని పేర్కొన్నారు. నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో వాకీటాకీ ద్వారా పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.


