వేతన వెతలు..!
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు మూడు నెలలుగా పెండింగ్ సమస్యలు పరిష్కరించి.. ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకోలు
సకాలంలో చెల్లించాలి
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ప్రతినెలా 1న సకాలంలో వేతనాలు విడుదల చేయాలి. పీఎఫ్, ఈఎస్‌ఐ, ఆరోగ్య, ఉద్యోగ భద్రతను కల్పించాలి. ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నాం. ప్రభుత్వాలు మారుతున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు.
– మధుకర్, కాంటిజెంట్ వర్కర్, దహెగాం
హామీలు అమలు చేయాలి
ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
– ఉపేందర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) స్కీం పరిధిలో పనిచేస్తున్న డాటా ఎంట్రీ, కాంటిజెంట్, సహాయ సిబ్బంది, ఎకౌంటెంట్స్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. సుమారు 60 మంది జీతాలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి అద్దె, పిల్లల చదువులు, ఈఎంఐలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
20 ఏళ్లుగా విధులు
నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) స్కీం కింద వివిధ విభాగాల్లో 20 ఏళ్లుగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. క్రమం తప్పకుండా ప్రతినెలా వేతనాలను చెల్లించాలని కోరుతున్నారు. అలాగే మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని వేడుకుంటున్నారు.
వేతన వెతలు..!
వేతన వెతలు..!


