ప్రశాంతంగా నవోదయ పరీక్ష
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి ప్రవేశం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివా రం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగి సింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాల్లో 6,192 మంది విద్యార్థులకు 4478 మంది(72.2 శా తం) హాజరు కాగా, 1,718 మంది గైర్హాజరయ్యా రు. 80 సీట్లకు 4,478 మంది పరీక్ష రాసినట్లు పర్యవేక్షకుడు, నవోదయ ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ వెల్ల డించారు. ఇక కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,632 మంది విద్యార్థులకు 9,91 మంది హాజరు కాగా 641 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించారు.
కాగజ్‌నగర్‌లో ఇబ్బందులు
కాగజ్‌నగర్ పట్టణంలో జవహర్ నవోదయ విద్యాలయం, సెయింట్ క్లారెట్ స్కూల్‌లో కేంద్రాలు ఏర్పా టు చేశారు. సెయింట్‌క్లారెట్ స్కూల్‌లో హాల్‌టికెట్ నంబర్లను బోర్డుపై కాకుండా గోడకు అంటించారు. హాల్‌టికెట్, రూం నంబర్లు వెతుక్కునేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాగజ్‌నగర్‌టౌన్ సీఐ ప్రేంకుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.
ప్రశాంతంగా నవోదయ పరీక్ష


