‘టెంట్‌హౌస్’ పోలింగ్ కేంద్రాలు
రంగు రంగుల వస్త్రాలతో అందంగా ముస్తాబు చేసిన ఇది మోడల్ పోలింగ్ కేంద్రం అనుకుంటే పొరపాటే. పక్కా భవనాలు లేకపోవడంతో ఎన్నికల నిర్వహణ కోసం తాత్కాలిక ఏర్పాటు ఇది. చింతలమానెపల్లి మండలం రణవెల్లి పంచాయతీలో ఇలా తాత్కాలికంగా టెంట్‌హౌస్ సామగ్రితో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.
చింతలమానెపల్లి/కౌటాల: ఐదేళ్లకోసారి నిర్వహించే ఓట్ల పండుగకు భారీస్థాయిలో ఏర్పాట్లు చేసి, ఓటర్లకు వసతులు కల్పించాల్సి ఉంది. అయితే రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే పలు ప్రాంతాల్లో పక్కా భవనాలు అందుబాటులో లేక అ ధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. కౌటా ల మండలం వీరవెల్లి పంచాయతీలో టెంట్ కింద పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 8 వార్డులో 532 ఓటర్లు ఉన్నారు. పంచాయతీ భవ నం నిర్మాణం పూర్తికాకపోవడంతో పాటు ప్రాథమిక పాఠశాలకు ఒకే భవనం ఉంది. పాఠశాల భవనంలో 4 వార్డులు, పాఠశాల ఆవరణలో టెంట్ కింద నాలుగు వార్డులకు ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సిబ్బంది ఉండేందుకు సైతం టెంట్‌లోనే ఏర్పాట్లు చేయడంతో.. ఆదివారం సాయంత్రం వచ్చినవారు చలికి ఇబ్బంది పడ్డారు.
మోడల్ కేంద్రాన్ని మరిపించేలా..
చింతలమానెపల్లి మండలం రణవెల్లికి నూతన పంచాయతీ కార్యాల యం మంజూరైంది. జీపీ కార్యాలయాన్ని తాత్కాలి కంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలోకి మార్చారు. అయితే ఆ స్కూల్ భవనం కూడా శిథిలావస్థకు చేరడంతో నూతన నిర్మాణం చేపడుతున్నారు. దీంతో ఎన్నికల నిర్వహణకు పక్కా భవనం లేకుండా పోయింది. అధికారులు తాత్కాలికంగా ఇలా పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. ఆదివారం ఇక్కడ 1,660 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
‘టెంట్‌హౌస్’ పోలింగ్ కేంద్రాలు
‘టెంట్‌హౌస్’ పోలింగ్ కేంద్రాలు


