గల్ఫ్ చట్టాలపై అవగాహన ఉండాలి
ఖానాపూర్: గల్ఫ్ దేశాలకు ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్లాలనుకునే ఆశావహులు అక్కడి చట్టాలు, పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సింగిరెడ్డి నరేష్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని తిమ్మాపూర్ పద్మశాలి సంఘ భవనంలో గల్ఫ్ వెళ్లేవారికి ముందస్తు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడి చట్టాలు, సంస్కృతి, పని విధానాలు, భద్రతా నిబంధనలు, వేతనాలు, ఒప్పందాల వివరాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. మోసాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎంబసీల హెల్ప్‌లైన్ నంబర్లు, సహాయక సంస్థల సమాచారాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సాయిండ్ల రాజయ్య, కోఆర్డినేటర్ కంటం రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.


