సుద్దాలలో 14 మంది, బుద్దారంలో నలుగురు
చెన్నూర్‌రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని సుద్దాల గ్రామ పంచాయతీ సర్పంచ్ రి జర్వేషన్ ఎస్సీ మహిళకు కేటాయించగా 14 మంది అభ్యర్థులు బరిలో ఉ న్నారు. 1,689 ఓటర్లకు గానూ 832 మంది పురుషులు, 857 మంది మహిళలు ఉన్నారు. కిష్టంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కాగా తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3,029 మంది ఓటర్లకు గానూ 1,467 మంది పురుషులు, 1,562 మంది మహిళలు ఉన్నా రు. గంగారం సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వుకాగా తొమ్మిది మంది బరిలో ఉన్నారు. 1,162 మంది ఓటర్లకుగానూ 578 మంది పురుషులు, 584 మంది మహిళలు ఉన్నారు. దుగ్నెపల్లి సర్పంచ్ ఎస్సీ జనరల్ రిజర్వుకాగా ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,556 మంది ఓటర్లకుగానూ 752 మంది పురుషులు, 804 మంది మహిళలు ఉన్నారు.
అతిచిన్న పంచాయతీ బరిలో నలుగురు
అతి చిన్న గ్రామ పంచాయతీ అయిన బుద్దారం స ర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వుకాగా నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 271 మంది ఓటర్లకుగానూ 134 మంది పురుషులు, 137 మంది మహిళలు ఉన్నారు.ఆయా పంచాయతీల్లో సర్పంచ్ పదవి ఎవరిని వరించనుందో? వేచి చూడాల్సిందే.
లక్ష్మణచాంద: గత ఎన్నికల్లో మండలంలోని రాచాపూర్ గ్రామ ఉప సర్పంచ్‌గా పనిచేసిన భూషి ముత్యం ప్రస్తుత ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించాడు. గతంలో తాను గ్రామస్తులకు చేసిన సేవతోనే ఈసారి సర్పంచ్‌గా తనకు అవకాశం కల్పించారని, గ్రామాభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొంటున్నాడు.
నాడు ఉపసర్పంచ్..నేడు సర్పంచ్
సుద్దాలలో 14 మంది, బుద్దారంలో నలుగురు
సుద్దాలలో 14 మంది, బుద్దారంలో నలుగురు


