జంట ఊర్లు.. రోడ్డే అడ్డు
సోన్ మండలం వెల్మల్, బొప్పారం గ్రామాల విషయంలో ఈ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. జంట గ్రామాలుగా పిలిచే ఈ రెండింటికీ ఓ చోట 30 అడుగుల వెడల్పున్న రహదారే సరిహద్దుగా ఉంటుంది. ప్రధాన రహదారికి ఇటు వెల్మల్, అటు బొప్పారంకు రోడ్డే పొలిమేరగా ఉంటుంది. ఈ రెండు గ్రామాలు ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు 1969లో పునరావాస గ్రామాలుగా ఏర్పడ్డాయి. ఈ రెండు గ్రామాల మధ్యలో 1.5 కిలోమీటర్ల రోడ్డు పొడవునా ఇరువైపులా ఇండ్లు ఉంటాయి. కొత్తవారు ఎవరైనా వస్తే ఒకే గ్రామం అనుకుంటారు. ప్రత్యేకించి అడిగితే కానీ తెలియదు. ఈ రెండు గ్రామాలకు రెండు గ్రామ పంచాయతీలు, ఇద్దరు సర్పంచులు, రెండు ప్రాథమిక పాఠశాలలు, ఈ రెండు ఊర్లతో పాటు, ముఠాపూర్, కుంచాన్‌పెల్లి కలుపుకొని జెడ్పీఎస్‌ఎస్ పాఠశాల ఉంటుంది. ఈ గ్రామంలో ఎప్పుడు చూసినా సందడిగానే కనిపిస్తుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
జంట ఊర్లు.. రోడ్డే అడ్డు


