శభాష్ ..ప్రేరిత్..!
మంచిర్యాలఅర్బన్: స్మార్ట్ ఫోన్‌ల వినియోగం పి ల్లలపై దుష్ప్రభావాలు చూపుతున్నాయి. ఆన్‌లైన్ గేమ్‌లు, ఇతర కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతున్న ఈ రోజుల్లో అందరిలా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటాడు మంచిర్యాలకు చెందిన ముంజం ప్రేరిత్. సాంకేతిక పరిజ్ఞానంతో త న ఆలోచనలకు పదునుపెట్టి ‘జ్ఞానయాత్ర’ పేరుతో క్విజ్‌యాప్ తయారుచేసి ఔరా అనిపించాడు.
తయారీకి మూడు నెలలు..
మంచిర్యాలకు చెందిన ముంజం బాబురావు, చందన దంపతుల కుమారుడైన ప్రేరిత్ స్థానిక కార్మెల్ హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నా డు. యాప్ డెవలప్‌మెంట్ లెస్సెన్ (పాఠం)తో తర్ఫీదు పొందిన ఈ చిన్నారి తన ఆలోచనకు పదును పెట్టాడు. పట్టుదలతో అందివచ్చిన సాంకేతికను ఉపయోగించి రోజువారీ క్విజ్‌లు, బహు ళ ఎంపిక ప్రశ్నలు, స్కోర్ ట్రాకింగ్ తదితర సరదాగా నేర్చుకోవటానికి ఉపయోగపడే అంశాలతో యాప్ రూపొందించాడు. ఇందుకు మూడు నెలల సమయం పట్టిందని పేర్కొన్నాడు. యాప్‌తో విద్యార్థులు క్విజ్, సాధారణ జ్ఞానం, విద్యా సంబంధిత ప్రశ్నలు నేర్చుకునే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ వినియోగించే తీరును బట్టి ఉంటుందని, విద్యను సులభంగా ఆసక్తికరంగా అందించాలనే లక్ష్యంతో ఈయాప్‌ను రూపొందించినట్లు ప్రేరిత్ ‘సాక్షి’కి తెలిపాడు.
గణితంలో ఘనుడు..
క్విజ్ యాప్ కాకుండా గణితంలో కూడా ప్రేరిత్ సత్తా చాటాడు. ఇదివరకు అలామా సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఏఏ–1లో 13 దేశాల నుంచి వెయ్యిమంది విద్యార్థులు పాల్గొనగా ప్రేరిత్ ప్రథమ స్థానం సాధించాడు. ఏడు నిముషాల్లో అత్యధిక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంతో అలామా సంస్థ ఆన్‌లైన్ సర్టిఫికెట్ అందజేసింది.


