శతాధిక వృద్ధురాలు మృతి
హాజీపూర్(మంచిర్యాలరూరల్): జిల్లా కేంద్రంలోని గోసేవ మండల్ కాలనీకి చెందిన శతాధిక వృద్ధురాలు బొట్ల ఆగమ్మ శనివారం మృతి చెందింది. గత జూలై 25న కుటుంబ సభ్యుల సమక్షంలో వందేళ్ల జన్మదిన వేడుకలు జరుపుకున్న వృద్ధురాలి భర్త 30 ఏళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఆరుగురు కుమారులు, కుమార్తె సంతానం. మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, పలువురు ప్రజా ప్రతినిధులు, వైద్యులు, ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు, సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.
పాము కాటుకు మహిళ..
తిర్యాణి: పాము కాటుకు మహిళ మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన తుమ్రం జమున (58) తన సోదరుడు పర్వత్‌రావు ఇంటివద్ద ఉంటోంది. గురువారం చేనులో కూరగాయలు తెంపేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె కాలుకు ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. ముళ్లు గుచ్చుకున్నాయని భావించి ఇంటికి వచ్చింది. కొద్దిసేపటికి వాంతులు కావడంతో పాటు కాలు వాపెక్కడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పాము కాటు వేసినట్లు నిర్ధారించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి మృతి చెందింది.
చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి..
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చి కిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీ ఐ ప్రమోద్‌రావు తెలిపారు. ఈనెల 12న స్థానిక రైల్వే స్టేషన్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని స్థానికులు గు ర్తించి 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొ ందుతూ శనివారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మృతుని వద్ద ఎలాంటి ఽఆధారాలు లభించలేదని, బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలకు 8712656534లో సంప్రదించాలన్నారు.
శతాధిక వృద్ధురాలు మృతి


