చెన్నూర్‌లో నవోదయ పరీక్షలో మాస్ కాపీయింగ్
చెన్నూర్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన నవోదయ ఎంట్రెన్స్ పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగిందని విద్యార్థులు ఆరోపించారు. రూమ్ నెంబర్ 6లో విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా ఇన్విజిలేటర్ వచ్చి వారి బంధువుల పిల్లలకు ఒకరి పరీక్ష పేపర్‌ను మరొకరికి ఇచ్చి రాయించారన్నారు. అంతే కాకుండా తెలియని జవాబులను పరీక్ష ముగిసే వరకు చెప్పడం దారుణమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదంతా కష్టపడి చదువుకుంటే కాపీ కొట్టి పాసైన విద్యార్థులు మా భవిష్యత్‌ను నాశనం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పే పంతుళ్లే ఇలా కాపీయింగ్‌కు ప్రోత్సహించడం సరికాదన్నారు. గతేడాది సైతం ఇలాగే జరిగిందని మా అబ్బాయి చెప్పాడని విద్యార్థి తండ్రి జగదీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత పాఠశాలలో నవోదయ ప్రవేశ పరీక్షలో జరిగిన కాపీయింగ్‌పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన ఇన్విజిలేటర్ల పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


