రక్షణ చర్యలతోనే ప్రమాదాల నివారణ
రెబ్బెన(ఆసిఫాబాద్): గనులు, డిపార్టుమెంట్లలో రక్షణ చర్యలు పాటిస్తేనే ప్రమాదాలు నివారించవచ్చని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీటీసీలో శుక్రవారం 56వ వార్షిక రక్షణ పక్షోత్సవా లను ఘనంగా నిర్వహించారు. రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ ఎస్వోటూజీఎం కోటిరెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు ఎంవీటీసీని పరిశీలించారు. ఉద్యోగులు అందిస్తున్న శిక్షణ వివరాలను తెలుసుకున్నారు. త రగతులకు హాజరైన ఒప్పంద, సింగరేణి ఉద్యోగుల ను ప్రశ్నలు అడిగారు. జీఎం మాట్లాడుతూ సింగరే ణి ఉద్యోగులకు ఎంవీటీసీనే మొదటి గురువని అ న్నారు. శిక్షణ కాలంలో నేర్చుకునే ప్రతీ అంశాన్ని పాటించాలని సూచించారు. ఏరియా రక్షణాధికారి రాజమల్లు, ఎంవీటీసీ మేనేజర్ మధుసూదన్, ఎస్‌ఈ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


