కెరమెరిలో హైడ్రామా
కెరమెరి: కెరమెరి ఉప సర్పంచ్ ఎన్నికలో హైడ్రామా చోటుచేసుకుంది. గురువారం బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి పెందోర్ ఆనంద్‌రావు సర్పంచ్‌గా రాథోడ్ ఉత్తం నాయక్‌పై 151 ఓట్ల తేడాతో గెలుపొందారు. 14 వార్డుల్లో బీఆర్‌ఎస్ బలపర్చినవారు ముగ్గురు విజయం సాధించగా, పది మంది కాంగ్రెస్‌కు చెందిన చెందిన వారు గెలిచారు. ఒక్కరు ఏకగ్రీవం కాగా ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో బీఆర్‌ఎస్ బలం నాలుగుకు చేరింది. మరో ముగ్గురు కాంగ్రెస్ మద్దతుదారులు కూడా వీరితో జత కలిశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పోలీసులు వారిని కెరమెరి పంచాయతీకి తీసుకువచ్చారు. కార్యాలయంలో ఎన్నిక నిర్వహించగా ఏడుగురు వార్డు సభ్యులు వాగ్మారే శ్రీకాంత్‌కు మద్దతుగా చేతులెత్తారు. శ్రీకాంత్ ఉపసర్పంచ్‌గా ఎన్నికైనట్లు ఆర్‌వో చంద్రయ్య, జోనల్ అధికారి ముక్తేశ్వర్ తెలిపారు.
పోలీసులతో వాగ్వాదం
ఎంపీడీవో కార్యాలయం ఎదుట శుక్రవారం కాంగ్రెస్ నేతలు తమ అభ్యర్థులను బీఆర్‌ఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని ఆందోళన చేశారు. వార్డు సభ్యుడిని అప్పగించాలని కాంగ్రెస్ నాయకుడు రాథోడ్ ఉత్తం నాయక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎస్సై మధుకర్ వారిని శాంతింపజేశారు.


