భక్తిశ్రద్ధలతో హోమం
కౌటాల(సిర్పూర్): మండల కేంద్రంలోని సదాశివపేట శివాలయ 52వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో బుధవారం ఆలయ ప్రధాన అర్చకులు అంబేద శంకరయ్య ఆధ్వర్యంలో అఖండ దీపారాధన, ధ్వజారోహణ, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు చేపట్టారు. భక్తిశ్రద్ధలతో రుద్రహోమం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల సందడి నెలకొంది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాగా, గురువారం ఉదయం ఉదయం 5.30 గంటలకు ఆలయంలో అగ్నిగుండ ప్రవేశం, పూర్ణహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు అంబేద శంకరయ్య తెలిపారు.


