ఘనంగా దీక్షా విజయ్ దివస్
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో మంగళవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో దీక్షా విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివా ళులర్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల కు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, బీఆ ర్‌ఎస్ రాష్ట్ర నాయకురాలు సరస్వతి, మాజీ ఏఎంసీ చైర్మన్ చిలువేరు వెంకన్న, నాయకులు నిసార్, పోచయ్య, అశోక్, జావెద్, సాజి ద్, అన్సార్, సాలాం, చందు, నారాయణ తదతరులు పాల్గొన్నారు.


