‘కౌటాల’లో పోటీ తీవ్రం
కౌటాల(సిర్పూర్): రెండో విడతలో ఎన్నికలు జరిగే మండలాల్లో అత్యధికంగా కౌటాల మండలంలో పోటీ తీవ్రంగా ఉంది. జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మండలంలోని పల్లెల్లో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీల మద్దతుదారులపాటు రాజకీయంగా ఎదిగేందుకు స్వతంత్రులు బరిలో నిలిచారు. బెజ్జూర్, దహెగాం మండలాలతో పోల్చితే కౌటాలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు తక్కువగా ఉన్నాయి. కౌటాల మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉండగా 85 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 182 వార్డు సభ్యుల స్థానాలకు 461 మంది అదృష్టం పరీక్షించుకోనున్నారు. అన్ని మండలాల కంటే వార్డు సభ్యులు సైతం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో తలోడి, శీర్షా, కనికి పంచాయతీలు ఏకగీవ్రమయ్యాయి. కానీ ఈసారి ఒక్క పంచాయతీ కూడా ఏకగీవ్రం కాలేదంటే పోటీ ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. చిన్న పంచాయతీల్లో సైతం ముగ్గురు, నలుగురు బరిలో నిలిచి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
పంచాయతీల వారీగా అభ్యర్థుల వివరాలు
మండలం జీపీలు అభ్యర్థులు
దహెగాం 24 76
బెజ్జూర్ 22 83
కౌటాల 20 85
చింతలమానెపల్లి 19 67
సిర్పూర్(టి) 16 65
పెంచికల్‌పేట్ 12 49
మొత్తం 112 425
‘కౌటాల’లో పోటీ తీవ్రం


