ఎన్నికల సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు
వాంకిడి(ఆసిఫాబాద్): పంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తి వారి, డేవిడ్‌తో కలిసి పరిశీలించారు. పోస్టల్ బ్యాలె ట్ వినియోగ కేంద్రం, స్ట్రాంగ్ రూం, బ్యాలెట్ పేప ర్లు, బాక్సులు, తదితర సామగ్రిని పరిశీలించి అధి కారులకు సూచనలు చేశారు. సిబ్బంది కోసం హె ల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని, జోనల్ అధికారులు, స్టేజ్– 2 ఆర్వో సిబ్బందిని బుధవారం సాయంత్రం 4 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు తరలించా లని ఆదేశించారు. అనంతరం వాంకిడిలోని కేజీబీవీ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్, తహసీల్దార్ కవిత, ఎంపీడీవో జ్యోత్స్న పాల్గొన్నా రు.
తొలివిడత ప్రశాంతంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్: పంచాయతీ తొలివిడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి కమిషన్ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, సాధారణ వ్యయ పరిశీలకులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్‌కు ముందురోజు, పోలింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యలు, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచుల ఎన్నిక, ఓటర్ల ప్రభావిత అంశాలను అరికట్టడంపై సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ నితిక పంత్, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతిగౌడ్, నోడల్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. స్టేజ్– 2 ఆర్వోలకు శిక్షణ ఇవ్వడంతోపాటు పోలింగ్, ఇతర అధికారులకు శిక్షణ పూర్తయ్యిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి కౌంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు.


