ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
పెంచికల్‌పేట్(సిర్పూర్): గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. పెంచికల్‌పేట్ మండలం లోడుపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలతో పాటు ఎన్నికల సామగ్రి తరలింపులో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అల్బర్ట్, తహసీల్దార్ తిరుపతి, ఎస్సై అనిల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.


