జోనల్‌స్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని పెట్రోల్ పంప్ జెడ్పీ పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం జోనల్‌స్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రూరల్ సీఐ కుమారస్వామి హాజరై పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. యువకులు వ్యస నాలకు బానిసలు కావొద్దని సూచించారు. అండర్– 14 విభాగంలో విక్రమ్ తేజ, అండర్– 19 విభాగంలో సుమిత్ తివారి, అంకిత్, ప్రభాత్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారని ఎస్జీఎఫ్ జిల్లా సెక్రెటరీ వెంకటేశ్ తెలిపారు. వీరు వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వేముర్ల మధు, సెక్రెటరీ మధురై శేఖర్, జెడ్పీఎస్‌హెచ్ పీడీ ఇంద్ర, సీనియర్ పీడీ సాంబశివరావు, బాక్సర్లు సాయి, శివ, వంశీ తదితరులు పాల్గొన్నారు.


