రాష్ట్రస్థాయి నేతగా..
మాజీ మంత్రి కొట్నాక భీంరావు మరో కుమార్తె మర్సోకోల సరస్వతి 2002, 2015లో రెండుసార్లు ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందారు. పదేళ్లపాటు సర్పంచ్‌గా సేవలందించారు. 2003 నుంచి 2009 వరకు ఏఐసీసీ సభ్యురాలిగా, టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టికెట్ దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంతో అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ పార్టీలోనూ రాష్ట్రస్థాయి నాయకురాలిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం తన సోదరి ఎమ్మెల్యే కోవ లక్ష్మికి మద్దతుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.


