ట్రైనీ బీట్ అధికారుల క్షేత్ర పర్యటన
సిర్పూర్(టి): తెలంగాణ ఫారెస్టు అకాడమీ 39వ బ్యాచ్‌కు చెందిన ట్రైనీ బీట్ అధికారులు సోమవారం సిర్పూర్(టి) రేంజ్ పరిధిలోని మాకిడి సెక్షన్ ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతంలో పర్యటించారు. అడవిలో వన్యప్రాణు ల సంరక్షణ, ప్లాంటేషన్ పరిరక్షణ, టైగర్ ట్రా కింగ్ తదితర అంశాలను సిర్పూర్(టి) ఎఫ్‌ఆర్‌వో ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అనంతరం వారు ఇటిక్యాల పహాడ్ అటవీ ప్రాంతంలో తిరుగుతూ వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, సెక్షన్ అధికారి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


