నాడు భార్య.. నేడు భర్త ఏకగ్రీవమే
వాంకిడి: మండలంలోని దాబా గ్రామ పంచా యతీ సర్పంచ్‌గా గతంలో కోట్నాక సుమిత్ర ఏకగ్రీవమై సేవలు అందించగా ప్రస్తుతం ఆమె భర్త కోట్నాక జంగు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి సవాతి గ్రామ పంచాయతీ నుంచి కొత్త జీపీగా ఏర్పడ్డ దాబా గ్రామం 2019 పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామస్తులంతా కోట్నాక సుమిత్రను ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఎస్టీ జనరల్‌కు అవకాశం దక్కడంతో ఆమె భర్త కో ట్నాక జంగును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాబాలో సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు స భ్యులను సైతం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కోట్నాక సుమిత్ర
కోట్నాక జంగు
నాడు భార్య.. నేడు భర్త ఏకగ్రీవమే


