‘బీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి’
రెబ్బెన: గ్రామాల అభివృద్ధి జరగాలంటే మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆదివారం గోలేటి గ్రామపంచాయతీ పరిధిలోని గొండుగూడ ప్రజలను కలిశారు. ఈసందర్భంగా గ్రామంలో నెలకొ న్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ బీఆర్‌ఎస్ సర్పంచ్, వార్డుసభ్యులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతీ ఇంటికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిందన్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వనజ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ తోట లక్ష్మణ్, గ్రా మపటేల్ జంగుపటేల్, లచ్చు పటేల్, నాయకులు సురేశ్, నగేష్, శ్రీనివాస్, సత్యనారాయణ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.


