ఖేలో ఇండియా సెంటర్ ఏర్పాటు చేయాలి
పట్టణంలో గత 26 ఏళ్లుగా క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇస్తున్నా ను. ఉన్న వనరులు, దాతల సహకారంతో క్రీడాకారులను సిద్ధం చేస్తున్నా. ఖేలో ఇండియా సెంటర్‌ను కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసేలా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఉన్నతాధికారులు కృషి చేయాలి. నా దగ్గర శిక్షణ తీసుకున్న క్రీడాకారులు ఆర్మీ, పోలీస్, సీఆర్పీ, పీఈటీలుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వారు మాకు అండగా ఉన్నారు. వారి సహాయసహకారాలతో ఉచిత శిక్షణ కొనసాగిస్తున్నాం.
– మధురై శేఖర్ మాస్టర్,
జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ


