దాహం తీరేలా.. నిధుల వరద!
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో తా గునీటి సమస్య పరిష్కరిచేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమృత్ 2.0 కింద కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి రూ.31.50 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో 70వేల జనాభా ఉంది. జనాభాకు సరిపడా తాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పట్టణంలో ప్రస్తుతం 5 ఓవర్ హెడ్ మంచినీటి ట్యాంక్‌ల ద్వారా 11 ఎంఎల్‌డీ, మిషన్ భగీరథ ద్వారా 7 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నారు. అండర్‌లైన్ పైపులైన్ తరుచూ లీకేజీలతో పట్టణంలో మూడు, నాలుగు రోజుల పాటు మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ ప్రజలకు శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయడంతో పట్టణంలో మంచినీటి ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు నిర్మించి వీటి ద్వారా 1800 కిలో లీటర్ల నీటిని అందించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.
ఐదు ఓవర్‌హెడ్ ట్యాంకులు..
మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం తాగునీటి సరఫ రాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టణంలో ఐదు ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నాయి. పెద్దవాగు పంప్‌హౌజ్ నుంచి ఓవర్‌హెడ్ ట్యాంకుల్లోకి నీటిని సరఫరా చేసి రెండు రోజులకు ఒక సారి విడతల వారీగా ఆయా వార్డుల్లో మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్‌పంప్‌లోని గాంధీనగర్, తీరందాజ్‌టాకీస్, ఈఎస్‌ఐ గేటు, ఎల్లగౌడ్‌తోట వా టర్ ట్యాంక్ సమీపంలో పైప్‌లైన్లు లీకేజీలతో నీరు వృథాగా పోతోంది. ప్రధానంగా మెయిన్ వాల్వ్‌ల వద్ద నీరు లీకేజీలు అవుతున్నాయి.
30 వార్డులు..
పట్టణంలో 30 వార్డులు ఉన్నాయి. 6456 మంచి నీటి కనెక్షన్లు ఉన్నాయి. పట్టణంలోని ఆయా కాలనీ ల్లో ఉదయం 5 గంటల నుంచి విడతల వారీగా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని ద్వారకానగర్, సంజీవయ్య కాలనీ, మార్కెట్ ఏరి యా, గాంధీనగర్, సీతాపతీరోడ్, బాలాజీనగర్, శ్రీ రాంనగర్, నౌగాం బస్తీ, సంఘం బస్తీ, సర్ధార్‌బస్తీ, పెట్రోల్‌పంప్, కౌసర్‌నగర్, ఇర్ఫాన్‌నగర్ కాలనీ, ఈఎస్‌ఐ కాలనీ, సర్‌సిల్క్ ఏరియాల్లో రోజువిడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు.
పాత తహసీల్దార్ ఆఫీస్ సమీపంలో ప్రధాన వాల్వ్ వద్ద లీకేజీ అవుతున్న మంచినీరు
ఈఎస్‌ఐ ట్యాంక్ వద్ద లీకేజీ అవుతున్న మంచినీరు
మున్సిపల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
కాగజ్‌నగర్ మున్సిపల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. మున్సిపల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు అందజేశాం. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా యూఐడీఎఫ్ నిధులు రూ.18.70 కోట్లు, ఆసిఫాబాద్‌కు రూ.15కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో మున్సిపాలిటీ అభివృద్ధి కానుంది.
– పాల్వాయి హరీశ్‌బాబు,
ఎమ్మెల్యే, సిర్పూర్(టి)
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం
మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి. పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నాం. మంజూరైన నిధులతో పట్టణంలో మరో మూడు ఓవర్‌హెడ్ ట్యాంక్‌లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రత్యేక అధికారుల ఆమోదం తరువాత పనుల ప్రక్రియ చేపడుతాం.
– ఏల్పుల రాజేందర్,
మున్సిపల్ కమిషనర్, కాగజ్‌నగర్
దాహం తీరేలా.. నిధుల వరద!


