అంబేడ్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: అంబేడ్కర్ ఆశయసాధనకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. అంబేడ్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు మర్సుకోల సరస్వతి, చిలువేరు వెంకన్న, నిసార్, నారాయణ, సాంగ్డె జీవన్, వామన్, తదితరులు పాల్గొన్నారు.
పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో..
రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జి ల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ రా జ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకా లం పదిలంగా ఉంటుందన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్యాం, తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో..
విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళు లర్పించారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షులు కర్ణాగౌడ్ మాట్లాడుతూ సామాజిక న్యాయంకోసం అంబేడ్కర్ చేసిన పోరాటం ప్రతీ తరానికి స్ఫూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సిరాజ్, కృష్ణ, తుకారాం, పెంటయ్య, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
సందీప్‌నగర్‌లో..
మహా పరినిర్వాన్ దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలో పంచాశీల జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సుధాక ర్, పురుషోత్తం, లింగయ్య, ప్రవీణ్, అజిత్, మహేష్, విష్ణు, జగదీష్, సుజిత్ , తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి
కాగజ్‌నగర్‌రూరల్: యువత డాక్టర్ అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకెళ్లాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపు నిచ్చారు. కాగజ్‌నగర్ పట్టణం, చింతగూడలో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కును అమ్ముకోకుండా, ఎలాంటి ప్రలోభా లకు లోనుకాకుండా నిజాయతీగల నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. నియోజకవర్గ కన్వీన ర్ లెండుగురె శ్యాంరావు, కొంగ సత్యనారాయణ, మిన్హాజ్, వరలక్ష్మి, కమల పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి
అంబేడ్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి


