నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కాగజ్‌నగర్‌టౌన్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నితికా పంత్ అన్నారు. శనివారం పోలీసుల ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తా నుంచి రాజీవ్‌గాంధీ చౌరస్తా వరకు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతియుత ఎన్నికలకు పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల సందర్భంగా డబ్బు పంపిణీ, బెదిరింపులు, ఓటర్లపై ఒత్తిడి, తదితర అక్రమ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహించరాదన్నారు. జిల్లాలో 3 ప్రధాన చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు చేపడుతున్నామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరిగేతే తక్షణం స్పందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, పట్టణ సీఐ ప్రేం కుమార్, రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సైలు సుధాకర్, సందీప్, కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
పోలీసు వ్యవస్థలో హోంగార్డుల పాత్ర కీలకం
ఆసిఫాబాద్‌అర్బన్: పోలీసు వ్యవస్థలో హోంగార్డుల పాత్ర కీలకమని, శాంతి భద్రతల పరిరక్షణలో వా రు పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిదని ఎస్పీ నితికా పంత్ కొనియాడారు. హోంగార్డుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని పో లీసు హెడ్ క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. హోంగార్డుల సంక్షేమంకో సం పోలీసుశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నా రు. ఈ సందర్భంగా విధుల్లో ప్రతిభ కనబర్చిన హోంగార్డులకు ప్రశంస పత్రాలు అందజేశారు. అ నంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎ స్పీ చిత్తరంజన్, ఆర్‌ఐ హోంగార్డ్ విద్యాసాగర్, ఆర్ ఐ అడ్మిన్ వామనమూర్తి, ఆర్‌ఐ (ఎంటీవో) అంజ న్న, తదితరులు పాల్గొన్నారు.


