వన్యప్రాణుల సంరక్షణలో అప్రమత్తత అవసరం
రెబ్బెన(ఆసిఫాబాద్): వన్యప్రాణులు, అటవీ సంప ద సంరక్షణలో అధికారులు, సిబ్బందికి అప్రమత్తత అవసరమని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ టిబ్రేవాల్ అన్నారు. రెబ్బెన రేంజ్ పరిధిలోని తక్కళ్లపల్లి, ధర్మారం ప్లాంటేషన్లను శుక్రవారం పరి శీలించారు. ఆయన మాట్లాడుతూ వన్యప్రాణులతో పాటు అటవీ ప్రాంత సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. అటవీ జంతువులకు ఎలాంటి హాని జరగకుండా చూడాలన్నారు. ప్రధానంగా పు లుల సంరక్షణ విషయంలో రాజీ పడొద్దని సూచించారు. జిల్లాలో పెద్దపులుల సంచారం పెరిగిన నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్లాంటేషన్లకు సంబంధించిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రెబ్బెన రేంజ్ అధికారి భానేష్, బీట్ అధికారులు అయాజ్, స్వాతి పాల్గొన్నారు.


