పరిశీలించి.. సూచనలు చేసి
తిర్యాణి(ఆసిఫాబాద్): మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేసి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలన్నారు. అనంతరం ప్రధా న మంత్రి జన్‌మన్ యోజన కింద మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. రాళ్ల కన్నెపల్లి గ్రామంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు మ ధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో వేముల మల్లేశ్, పీఆర్ ఏఈ సుహాస్ తదితరులు పాల్గొన్నారు.


