అగ్నివీర్‌కు డిగ్రీ విద్యార్థి ఎంపిక
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ బీఏ ఫస్టియర్ పూర్తి చేసిన మండల చిరంజీవి ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ ఉద్యోగానికి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. మధ్యప్రదేశ్‌లో అగ్నివీర్ శిక్షణను పూర్తి చేసుకున్నాడని, త్వరలో విధుల్లోకి చేరనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవిని శుక్రవారం కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనరసింహం, అధ్యాపకులు అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నిత్యం క్రమశిక్షణతో ఉండి చిన్న వయస్సులోనే ఉద్యోగం సాధించి చిరంజీవిని ఇతర విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటేశం, మేరి రోజ, సత్యనారాయణ పాల్గొన్నారు.


