ఈవీఎంల గోదాం వద్ద పటిష్ట బందోబస్తు
ఆసిఫాబాద్: జిల్లాలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపర్చిన గోదాం వద్ద పటిష్ట బందోబస్తు చేపట్టినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను శుక్రవారం అదనపు కలెక్టర్ డేవిడ్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించారు. బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాం వద్ద పోలీసు సిబ్బంది సమన్వయంతో బందోబస్తు చేపట్టామన్నారు. 24 గంటలపాటు నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని వివరించారు.


