అధికారుల ర్యాండమైజేషన్ పూర్తి
ఆసిఫాబాద్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, అదనపు పోలింగ్ అధికారుల మొదటి ర్యాండమైజేషన్ పూర్తయ్యిందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్ సమక్షంలో పోలింగ్, అదనపు పోలింగ్ అధికారుల మొదటి ర్యాండమైజేషన్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికల కోసం పోలింగ్, అదనపు పోలింగ్ అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టామని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అధికారులను కేటాయించామని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, ఎన్‌ఐసీ ఇన్‌చార్జి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో ఆలస్యం వద్దు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఆలస్యం వద్దని, త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వంతెనలు, కల్వర్డులు, రహదారులు, అదనపు గదులు, నూతన భవనాలు, పంచాయతీ కార్యాలయాలు, ప్రధాన మంత్రి జన్‌మన్ జుగా పథకం కింద చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌వో అబిద్ అలీ, అన్ని విభాగాల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


